same sex marriage legalises
-
స్వలింగ వివాహాలు ఏయే దేశాల్లో చట్టబద్ధమో తెలుసా?
దేశంలో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్గత విషయం అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది కుటుంబంలో భాగం కావాలనేది మానవ లక్షణంలో ప్రధాన భాగమని, స్వీయ అభివృద్ధికి ఇది ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాము ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని, వాటిని గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రత్యేక వివాహ చట్టం (SMA) సవరణ అంటే దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకుపోవడమేనని చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదని సీజే స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల కలయికను లైంగిక ధోరణి ఆధారంగా పరిమితం చేయలేమన్నారు. క్వీర్ జంటలతో సహా అవివాహిత జంటలు సంయుక్తంగా దత్తత తీసుకోవచ్చని తీర్పునిచ్చారు. భిన్న లింగ (స్త్రీ-పురుష) జంటలు మాత్రమే బిడ్డకు స్థిరత్వాన్ని అందించగలరని కోర్టు వాదించ లేమన్నారు. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తీర్పుతో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. అయితే భారత్‌లో స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల మారథాన్ విచారణ తర్వాత ఈ పిటిషన్లపై మే 11న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం స్వలింగ వివాహ గుర్తింపును వ్యతిరేకిస్తోంది. అటు ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ కూడా భారత పౌరులేనని, వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయని, స్వీయ జీవన విధానాన్ని నిర్ణయించుకునే, నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని, దాన్ని చట్టబద్ధంగా అంగీకరించాలని, స్వలింగ వివాహాల (Same sex marriages) వల్ల సమాజానికి ఎలాంటి హాని జరగబోదని, స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని వేధించడం తగదని, సమాజంలోని అన్ని సామాజిక ప్రయోజనాలను వారికీ కల్పించాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ మద్దతుదారుల వాదన. మరోవైపు స్వలింగ వివాహాలతో భారతదేశ సామాజిక, సాంస్కృతిక జీవనానికి పునాదిలాంటి కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. అలాగే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్టోనియా(2024) నిలిచింది. కాగా మానవ హక్కుల ప్రచారం వేదిక "ప్రపంచంలోని వివాహ సమానత్వం" డేటాప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి. 30కిపైగా దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం, ఇదిగో జాబితా నెదర్లాండ్స్: 2001, బెల్జియం: 2003 2005: కెనడా, స్పెయిన్, దక్షిణాఫ్రికా: 2006 2009: నార్వే, స్వీడన్ 2010:ఐస్లాండ్, పోర్చుగల్,అర్జెంటీనా డెన్మార్క్: 2012, 2013: ఉరుగ్వే, న్యూజిలాండ్: ఫ్రాన్స్, బ్రెజిల్, 2014 ఇంగ్లాండ్ అండ్ వేల్స్, స్కాట్లాండ్ 2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా 2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా 2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా 2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్ 2020 ఐర్లాండ్,కోస్టా రికా 2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా 2023 అండోరా 2024: ఎస్టోనియా -
Centre to Supreme Court: స్వలింగ సమస్యలపై కమిటీ
న్యూఢిల్లీ: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సెక్రెటరీ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. స్వలింగ జంటలకు జాయింట్ బ్యాంకు ఖాతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ పథకాల్లో స్వలింగ భాగస్వామిని నామినీగా చేర్చడం వంటివాటిపై నెలకొన్న సమస్యలను ఏప్రిల్ 27 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తింది. వీటి పరిష్కారానికి ఏం చేయొచ్చో ఆలోచించాలని సూచించింది. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కోర్టు అంగీకరిస్తే కమిటీ వేసి అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలిస్తామని వివరించారు. పిటిషనర్ల సలహాలు, సూచనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. అందుకు తమకభ్యంతరం లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ ఎ.ఎం.సింఘ్వి అన్నారు. అయితే దీనివల్ల పరిష్కారం లభించదన్నారు. ధర్మాసనమే దీనిపై సమగ్రమైన తీర్పు వెలువరించాలని కోరారు. కేంద్రం సూచనను ఓ చక్కని ముందడుగుగా న్యాయమూర్తి జస్టిస్ భట్ అభివర్ణించారు. స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు కమిటీతో పరిష్కారం లభించగలదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తీర్పు వెలువరిస్తామని సీజేఐ పేర్కొన్నారు. సహజీవనం చేస్తున్న స్వలింగ జంటల్లో 99 శాతం మంది పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నట్టు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సౌరభ్ కృపాల్, మేనకా గురుస్వామి తదితరులు చెప్పగా సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవతలి వర్గం కూడా తమ వాదనకు మద్దతుగా బోలెడన్ని గణాంకాలు చూపిస్తారు. అందుకే మేం ఇలాంటి మెజారిటీ నైతికతనో మరోదాన్నో ప్రాతిపదికగా తీసుకుని విచారణ జరపలేం. రాజ్యాంగ నియమ నిబంధనలను బట్టే ముందుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు మే 9న కొనసాగనున్నాయి. ఈడీ డైరెక్టర్‌గా ఇంకెవరూ పనికిరారా? ఈడీ డైరెక్టర్‌గా వరుసగా మూడోసారి సంజయ్ కుమార్ మిశ్రాకు పదవీ కాలం పెంచడంపై సుప్రీం కోర్టు మండిపడింది. డెరైక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పదవిని చేపట్టడానికి మిశ్రా తప్ప సంస్థలో మరెవరూ లేరా అని ప్రశ్నించింది. మూడోసారి కూడా ఆయనకే పదవీ కాలం పొడిగించాల్సిన ఆవశ్యకత ఏముందని ప్రశ్నించింది. మిశ్రా పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారికి పదవీకాలం ఎక్కువగా పొడగించకూడదని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. ‘‘ఈడీ డైరెక్టర్‌గా మిశ్రాకు మించిన వారు మరెవరూ లేరని మీరు భావిస్తున్నట్టున్నారు. ఆయన రిటైరయ్యాక ఎవరిని నియమిస్తారు?’’ అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ల బెంచ్ నిలదీసింది. కీలక కేసుల్ని విచారిస్తున్నప్పుడు ఒకరి ఆధ్వర్యంలో అయితే విచారణ సరిగా సాగుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. -
‘పెళ్లి స్త్రీ, పురుషుడికి మధ్యే జరగాలి.. కానీ’
బెర్లిన్: జర్మనీలో స్వలింగ సంపర్కులు విజయం సాధించారు. వారు పెళ్లిళ్లు చేసుకునేందుకు జర్మనీ పార్లమెంటు ఓకే చెప్పింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడింది. స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశపెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు ఆమోదం తెలిపింది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్‌తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ బిల్లును వ్యతిరేకించినా అది చట్టంగా రూపుదాల్చడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ‘నేను గేల పెళ్లిళ్లకు వ్యతిరేకంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా వ్యక్తిగతం. నా దృష్టిలో పెళ్లి అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే జరగాలి. పార్లమెంటు సమాజంలో మరింత మార్పును ఆశించిందేమో’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్మనీ చట్టంలో కొత్తగా మార్పు చేసిన ప్రకారం ‘ఒక స్త్రీ పురుషుడు, లేదా స్వలింగ వ్యక్తుల జీవితాల్లోకి వివాహం అడుగుపెట్టింది’ అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు లెప్టిస్ట్ పార్టీలు బాగా మద్దతిచ్చాయి. తాజాగా చేసిన చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహ అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను కూడా దత్తత తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇదివరకే జర్మనీ ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా దిగువ సభలో ఈ బిల్లు 393/226 ఓట్లతో పాసయి చట్టంగా రూపుదాల్చనుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.