కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ప్రైవేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొత్త ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ మినహా మిగిలిన కొన్ని దేశాల్లో ఈ కొత్త వర్క్ ఫ్రేమ్‌ను అమలు చేశాయి. ఆయా దేశాల్లో ఈ కొత్త వర్క్ మోడల్‌పై సానుకూల ఫలితాలు వస్తే కేంద్రం మన దేశంలో కొత్త పని విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మనదేశం సైతం ఐదు రోజుల కంటే తక్కువ పనిదినాల్ని నిర్వహిస్తున్న దేశాల జాబితాలో చేరుతుంది. అయితే ఇప్పుడు మనం 5 రోజుల కంటే తక్కువ పని దినాలున్న దేశాలేంటో తెలుసుకుందాం.
►ఈ ఏడాది జూన్ 2021 కంటే ముందు జపాన్ ఉద్యోగులు వారానికి ఐదురోజులు పనిచేయాల్సి వచ్చేది. కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒత్తిడి గురయ్యేవారు. అందుకే దేశంలో నాలుగు రోజుల పనిదినాల్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు ఫుమియో కీషీదా ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గి దేశంలో ఉద్యోగులు వారానికి నాలుగురోజులు పని చేసేలా చట్టాన్ని అమలు చేశాడు.
► గతేడాది న్యూజిల్యాండ్ సైతం దేశంలో నాలుగురోజుల పనిదినాల్ని అమలు చేసింది. వారంలో 4రోజులు పనిచేయడం వల్ల ఉద్యోగుల్లో వర్క్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుందని న్యూజిల్యాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
► ప్రపంచంలో అత్యంత తక్కువగా పనిదినాలు ఉన్న దేశం నెదర్లాండ్. కాబట్టే నెదర్లాండ్‌లో నిరుద్యోగ రేటు 3.3 శాతం మాత్రమే ఉందని ఆర్ధిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఇక ఆదేశంలో వారానికి 29 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మహిళా ఉద్యోగులు వారానికి 25 గంటలు, పురుషులు వారానికి 34 గంటలు పని చేస్తే సరిపోతుంది.
► ఐర్లాండ్ దేశంలో 20 సంస్థలు మాత్రమే వారానికి నాలుగు రోజులు పనిదినాల్ని అమలు చేశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అన్నీ సంస్థలు పూర్తి స్థాయిలో వారానికి నాలుగురోజుల పనిదినాల్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి.
► ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం 2015-19 నుంచి మధ్య కాలంలో వారంలో నాలుగు రోజుల పని దినాల్ని అమలు చేసే మంచి ఫలితాల్ని రాబట్టింది. వారంలో నాలుగు రోజులకు తగ్గట్లు శాలరీ ఉంటుంది. ఇక గంటలు పనిచేస‍్తే అందుకు తగ్గట్లు ఆయా సంస్థలు పేమెంట్ చేస్తుంటాయి.
► యూఏఈ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ నెలలో వారానికి 4.5 రోజులు పనిచేసే విధానాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. వారంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు హాలిడే ఇచ్చేలా యూఏఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
► కరోనా కారణంగా ప్రపంచంలోనే తొలి దేశం స్పెయిన్ వారానికి నాలుగు రోజులు పని చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
► జర్మనీ సైతం వారానికి నాలుగు రోజులు పనిచేసే విధానాన్ని అమలు చేసింది. అయితే ఈ కారణంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
చివరగా మనదేశ కేంద్ర ప్రభుత్వం సైతం నాలుగు రోజులు పని విధానంపై వర్క్ చేయనున్నాయి. ఒకవేళ వారానికి నాలుగు రోజులు పనిచేసేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తే.. రోజుకు 12గంటలు పనిచేసేలా వర్క్ ఫ్రేమ్‌ను తయారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment