Work From Home New Rules India: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో దేశంలో ఉద్యోగుల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ఒమిక్రాన్ కల్లోలం నేపథ్యంలో కొత్త వర్క్ కల్చర్‌ను కేంద్రం అమలు చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
కోవిడ్ కారణంగా గతేడాది నుంచి సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో న్యూ ఇయర్ ప్రారంభం నుంచి ఇంటి నుంచే పనిచేసే విధానంతో పాటు హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఆయా దిగ్గజ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కానీ ఒమిక్రాన్ వ్యాప్తితో హైబ్రిడ్ వర్క్‌ను అమలు చేయాలా? లేదంటే మరో ఏడాది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు మాత్రం భారత్‌తో పాటు మిగిలిన ప్రపంచదేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ పని విధానాన్ని వచ్చే ఏడాది కొనసాగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం ఉద్యోగుల విధుల నిర్వహణపై కొత్త ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేసేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొత్త ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో నిర్దేశించిన రోజుల్లో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేలా కేంద్రం హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసేలా అన్నీ ప్రైవేట్ రంగ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయనుందని ఎకనాకమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
అంతేకాదు పనిగంటల్ని నిర్దేశించడం, వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేసే ఉద్యోగులకు అదనంగా ఇంటర్నెట్, కరెంట్ బిల్లులను చెల్లించే అంశాలను సైతం కేంద్రం వర్క్ ఫ్రేమ్‌పై పనిచేస్తున్న నిపుణులతో చర్చించనుంది. ఈ వర్క్ ఫ్రేమ్‌ను దేశంలోని అన్నీ ప్రైవేట్ సంస్థలు ప్రవేశ పెడితే కరోనా, లేదంటే ఒమిక్రాన్‌ల నుంచి ఉద్యోగుల్ని సురక్షితంగా ఉంచొచ్చనేది కేంద్రం అభిప్రాయం. ఇదే విషయాన్ని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న ఫ్రేమ్ వర్క్ గురించి తెలిసిన పలువురు ఎకనామిక్స్ టైమ్స్‌కు తెలిపారు.
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థతో
హైబ్రిడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ పై కొత్త నిబంధనల్ని అమలు చేసేలా కేంద్రం ఫ్రేమ్ వర్క్‌పై పనిచేస్తుంది. ఫ్రేమ్ వర్క్‌లో దేశంలో కొత్త పని విధానం వల్ల ఉద్యోగులకు, సంస్థలకు కలిగే లబ్ధి, నష్టాల గురించి చర్చలు జరుపుతుందని, ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థను నియమించుకుంది. ఇప్పుడు కేంద్రం ఆ సంస్థతో కలిసి వర్క్ ఫ్రేమ్‌పై పనిచేస్తుంది.
ఇతర దేశాల్లో అమలు తర్వాతే
ఒమిక్రాన్ కారణంగా భారత్ మినహాయించి పలు దేశాది నేతలు కొత్త వర్క్ మోడల్‌ను అమలు చేసేలా నూతన చట్టాల్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ఆయా దేశాల్లో చట్టాలు అమలు తర్వాతే మనదేశంలో ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తుందని, పేరు చెప్పేందుకు ఇష్టపడని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అఫీషియల్స్ చెప్పారని ఎకనమిక్ టైమ్స్ ప్రస్తావించింది. ఇక ఈ కొత్త వర్క్ మోడల్ చట్టాలన్ని ఫోర్చుగల్ దేశం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ఓఈసీడీ సర్వేలో ఏం తేలింది
ఆర్థిక పురోగతి, ప్రపంచ దేశాల్లో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచ వ్యాపార రంగాన్ని యధాస్థితికి తెచ్చేందుకు 38 సభ్య దేశాలతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) సంస్థ ఏర్పాటైంది. ఇటీవల ఓఈసీడీ సంస్థ 25 దేశాల్లో జరిపిన సర్వేలో ఒమిక్రాన్ కారణంగా సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్‌కి మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment