కోవిడ్-19 రాకతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో, కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ఎండ్‌కార్ట్ పలకాలని చూస్తోన్న సమయంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అడ్డుకట్టవేసింది.
ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే విషయంలో కంపెనీలు సందిగ్థంలో నెలకొన్నాయి. కాగా కొన్ని కంపెనీలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగులను పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితం చేశాయి. ఏడు దిగ్గజ కంపెనీలు ఆయా ఉద్యోగులకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించారు.
పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం కల్పిస్తోన్న కంపెనీలు ఇవే..!
1. స్లాక్
అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాం స్లాక్ తన ఉద్యోగులను పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితం చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన వెంటనే కాలిఫోర్నియాకు చెందిన ఎంటర్‌ప్రైజ్ స్లాక్ తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే వీలును కల్పించింది. కొద్ది రోజుల తరువాత శాశ్వతంగా వర్క్ ఫ్రమ్‌హోం చేయవచ్చునని ఉద్యోగులకు సూచించింది.
2. ట్విట్టర్
స్లాక్ మాదిరిగానే ట్విటర్ కరోనా మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోం నిర్ణయం తీసుకుంది. ఆఫీసులో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉన్నవారు తప్ప మిగతా వారు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చునని ప్రకటించింది. ఉద్యోగులు తమ ఇష్టం వచ్చినప్పుడల్లా ఆఫీసులకు వెళ్లే అవకాశాన్ని కల్పించింది.
3. స్పార్టిఫై
స్వీడన్‌కు చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ స్పాటిఫై ఫిబ్రవరిలో తన ఉద్యోగుల కోసం ఎక్కడి నుంచైనా పని చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం స్ఫార్టిఫై ఉద్యోగులు కరోనా ముగిసిన తర్వాత కూడా వారు కోరుకున్న చోట ఇల్లు లేదా కార్యాలయం నుంచి పని చేయవచ్చునని పేర్కొంది.
4. టాటా స్టీల్
భారత దిగ్గజ కంపెనీ టాటా స్టీల్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గేట్లను తెరిచింది. టాటా స్టీల్ తమ ఉద్యోగుల కోసం 'ఎజైల్ వర్కింగ్ మోడల్' వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఉద్యోగులు సంవత్సరానికి 365 రోజుల వరకు వర్క్ ఫ్రమ్ హోంను ఎంచుకునే అవకాశాన్ని టాటా స్టీల్ కల్పిస్తోంది.
5. మెటా(ఫేస్‌బుక్)
మెటా (ఫేస్‌బుక్) తమ కంపెనీ ఉద్యోగుల కోసం ' ఆఫీస్ డిఫెరల్ ప్రోగ్రాం'ను రూపొందించింది. డిసెంబర్‌లో, సోషల్ మీడియా టెక్ దిగ్గజం మెటా తన యూఎస్ కార్యాలయాలను జనవరి 31, 2022న పూర్తిగా పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఉద్యోగులు రిమోట్‌గా కూడా పనిచేయవచ్చునని పేర్కొంది.
6. మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కొత్తగా హైబ్రిడ్ వర్క్ మాన్యువల్‌ను తయారు చేసింది. కంపెనీ ఉద్యోగులు వారి పని వారంలో 50 శాతం కంటే తక్కువ సమయం వరకు ఇంటి నుంచి స్వేచ్ఛగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉద్యోగులు రిమోట్‌గా పనిచేసే అవకాశాలను కూడా కల్పించింది అయితే.. అయితే కంపెనీ స్వంత జియోపే స్కేల్‌పై ఆధారపడి పరిహారం, ప్రయోజనాలు మారుతూ ఉండే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ శాశ్వత వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల కోసం హోమ్ ఆఫీస్ ఖర్చులను కవర్ చేస్తుంది. కంపెనీలో మేనేజర్ అనుమతి లేకుండా సౌకర్యవంతమైన పని గంటలు అందుబాటులో ఉంటాయి,
7.షాపిఫై
క్లౌడ్ ఆధారిత మల్టీ ఛానల్ షాపిఫై కూడా తన ఉద్యోగులను పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం చేయవచ్చునని పేర్కొంది.
చదవండి: Work From Home: వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment