
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, మంగళవారం మరో నాలుగు కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24 కు చేరింది.
ఒమిక్రాన్ సోకిన వారంతా.. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మాస్క్ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ప్రజలు కరోనా నిబంధలను విధిగా పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.
చదవండి: విమానాశ్రయంలో నిబంధనలు కఠినతరం
Comments
Please login to add a commentAdd a comment