ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం.
అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు.
ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్ ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment