
ఇన్ని రోజులు ప్రకృతి, కొత్త ప్రదేశాల అందాల్ని ఆస్వాధించిన పర్యాటకుల్లో మారిన ట్రెండ్. చరిత్రలోని చీకటి ప్రదేశాల్ని వీక్షించేందుకు మక్కువ చూపుతున్న యాత్రికులు. ఈ కొత్త టూరిజం ట్రెండ్‌నే డార్క్ టూరిజం అని అంటారు. ఈ ఏడాది డార్క్ టూరిజం పరిశ్రమ మార్కెట్ విలువ రూ.2.55లక్షలు కోట్లు.. కాగా రూ.3.46లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ డార్క్ టూరిజం జోరందుకుంది. మనదేశంలోనూ చరిత్రలోని చీకటి ప్రదేశాలపై యాత్రికులకు ఆసక్తి పెరుగుతుంది. మన దేశంలో డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలు.

భారతదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తుచేసే ఫోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలు.

అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ (జనరల్ డయ్యర్ భారతీయులను ఊచకోత చేసిన ప్రాంతం)ఉద్యానవనం, స్మారక చిహ్నం.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఎత్తయిన రూప్‌కుండ్ సరస్సు(అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుంది).

రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కుద్దార గ్రామం (ఇక్కడి ప్రజలు ఒక్కరాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెబుతున్నాయి).

మహారాష్ట్రలోని పుణేలో శనివార్ వాడ చారిత్రక కోట (అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం ఉంది).

రాజస్థాన్‌లో భాంగర్ కోట(మొఘల్ దళాలు చేసిన ఊచకోత)

గుజరాత్‌లోని అరేబియా తీరంలో డుమాస్ బీచ్ (పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని నమ్మకం).

గుజరాత్‌లోని లోథాల్ సింధూ లోయ నాగరికత ప్రదేశాలు

ముంబైలోని తాజ్ హోటల్ (2008లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతం).

భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పాండ్ (భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగిన ప్రదేశం).

గుజరాత్‌లోని భుజ్ (భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం).

కేరళలోని వయనాడ్ ప్రాంతం. అయితే సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో అధికారుల విజ్ఞప్తుల మేరకు వెనక్కి తగ్గిన పర్యాటకులు