ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా ప్రారంభమవుతుంది. కానీ తెలుగు ప్రజలు మాత్రం మార్చి/ఏప్రిల్‌లోనే జరుపుకుంటారు. అలాగే చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటాయి. ఇలా చాలా దేశాలు వారి సంప్రదాయం ప్రకారం ఇతర నెలల్లోని తేదీల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాయి. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌గా పరిగణిస్తున్నాయి ఎందుకు? ఆ రోజే వేడుకలు నిర్వహించడానికి కారణం?.
రోమన్లు చంద్రుని గమనంతో రూపొందించిన క్యాలెండర్‌ని అనుసరించేవారు. ఆ క్యాలెండర్‌లో కొత్త ఏడాది మార్చిలో ప్రారంభమయ్యింది. కానీ అధికారుల పదవీ కాలాన్ని మాత్రం జనవరి 1 నుంచి లెక్కించేవారు. అయితే క్రీస్తూ పూర్వం 153లో కొన్ని నెలలు జోడించి 12 నెలలు ఉన్న క్యాలెండర్‌ని రూపొందించారు. దీంతో నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలనే ప్రశ్న మొదలైంది.
ఇక్కడ సూర్య చంద్ర గమనంతో అప్పటి క్యాలెండర్ల తేదీలు సరితూగపోవడంతో జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్త అలెగ్జాండ్రియన్‌తో వాటి లెక్కలు సరిచేసి జూలియన్ క్యాలెండర్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్ అనే రోమ్ దేవుడు పేరు మీదగా వచ్చింది. దీంతో జనవరి 1వ తేదిని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్ అధికారికంగా ప్రకటించారు.
ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్ చాలా పొడవుగా ఉన్నప్పటికీ, దానిని పోప్ గ్రెగొరీ XII సంస్కరించి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు.ఈ క్యాలెండర్‌లో కూడా జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం అధికారికంగా ప్రకటించింది. ఆయన రూపొందించిన క్యాలెండర్ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటుపడి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి.
అయితే బ్రిటన్ గ్రెగొరియన్ క్యాలెండర్‌ను అనుసరించడానికి ఇష్టపడలేదు. అందుకే జనవరి 1 కాకుండా.. మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంది. కాలక్రమంలో ప్రపంచ దేశాలు, బ్రిటన్ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా సమస్యలు మొదలవ్వడంతో 1752లో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగొరియన్ క్యాలెండర్‌ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంది.
చరిత్రకారుల ప్రకారం..
- చరిత్రకారుడు గ్రీకు తత్వవేతత ఫ్లూటార్చ్ రోమ్ ఈ తేదీ గురించి మరొక వివరణ ఇచ్చారు. రోమ్ మొదటి రాజు రోములస్‌ని అంగారకుడి పుత్రుడిగా విశ్వసిస్తామని, ఆయన యోధుడు, యుద్ధ ప్రేమికుడు అని చెప్పుకొచ్చారు. అయితే రోమలస్ మార్చికి ప్రాధాన్యత ఇచ్చారు.
- అలాగే శాంతి ప్రేమికుడైన మరొక రోమ్ రాజు నుమా నగరాన్ని యుద్ధం నుంచి మళ్లించి పశుపోషణ వైపు మళ్లించాలనే ఆశయంతో జనవరికి ప్రాధాన్యం ఇచ్చాడు. అందువల్లే జనవరి 1వ తేదీనే ప్రపంచ దేశాలు న్యూ ఇయర్‌ని జరుపుకుంటున్నాయి. ఆ రోజునే అట్టహాసంగా వేడుకలు చేసుకుంటున్నారు.
(చదవండి: జస్ట్ కొన్ని గంటల తేడాతో.. న్యూ ఇయర్ వేడుకలు ముందుగా జరిగే దేశాలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment