కీవ్: కొత్త ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తంగా మారింది. రష్యా బలగాల విజృంభణ.. ప్రతిగా ఉక్రెయిన్ బలగాల కౌంటర్‌తో సరిహద్దు రక్తసిక్తం అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రష్యా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసింది రష్యా. అయితే ఆ పరిణామం ఉక్రెయిన్ భగ్గుమంటోంది. కారణం..
డ్రోన్ దాడులతో ఆ శుభాకాంక్షలు తెలియజేయడమే!. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి తన ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. హ్యాపీ న్యూఇయర్, బూమ్ అంటూ అక్షరాలు రాసి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే మైదానంలో పడింది ఆ డ్రోన్.
అదొక చీప్, టేస్ట్‌లెస్ మెసేజ్. ఇరాన్ ఆధారిత డ్రోన్‌పై రాసి ఉంది. ఉగ్రవాద దేశం, దాని సైన్యం తీరు గురించి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారాయన. మరోవైపు అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఇదొక అతి చేష్టగా అభివర్ణించారు. ఉక్రెయిన్ బలగాలు రష్యా బలగాలకు ధీటుగా సమాధానం ఇస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 40కి పైగా డ్రోన్‌లతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై మొదటిరోజే దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment