సాక్షి, హైదరాబాద్: ఇది మన రాష్ట్రమని తెలుగు వారంద రూ ఒక్కటేనని, ప్రతీ పౌరు డు బాధ్యతతో వ్యవహరిం చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దర్బార్ హాల్‌లో గవర్నర్ దంపతులను సామాన్యులు, ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు.
‘హైకోర్టు విభజన జరిగింది. ఉద్యోగుల విభజనపై గతంలో లాగా చొరవ తీసుకొని మళ్లీ మీటింగ్ పెడతారా’అని పలువురు గవర్నర్‌ను ప్రశ్నించగా.. త్వరలో ఆ సమస్యపై కూడా పని చేస్తానని సమాధానమిచ్చారు. తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షిం చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, సీఐఎస్‌ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment