
బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో నగర వాసులు సాగర తీరానికి చేరుకుని సంతోషంగా గడిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ.. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా వేడుకలు జరిపారు

చిన్నారులు రంగుల రాట్నం ఆడుతూ, గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ జ్ఞాపకాలను పదిలిపరుచుకున్నారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఇలా సాగర తీరంలో జోష్ కనిపించింది












