
బ్యాంకాక్ : నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అత్తింటివారు చేసుకుంటున్న పార్టీకి తనని సరిగా ఆహ్వానించలేదని ఓ థాయ్ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు మర్యాదలు చేయలేదని భావించి అత్తింటి వారిని, భార్యాపిల్లల్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలు... థాయ్‌ల్యాండ్‌కు చెందిన సుచీప్ సార్న్‌సంగ్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారింటికి వెళ్లాడు. అయితే తనకు ఆహ్వానం పలికేందుకు ఎవరూ రాకపోవడాన్ని అతడు అవమానంగా భావించాడు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఫుల్లుగా మద్యం సేవించిన సుచీప్... అత్తామామలు, తన భార్యాపిల్లల(తొమ్మిదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు)ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment