నటి శృతి హాసన్ కొత్త తత్వం | Shruthi Haasan New Year Resolution - Sakshi
Sakshi News home page

శృతి కొత్త తత్వం

Published Fri, Jan 3 2020 7:59 AM | Last Updated on Fri, Jan 3 2020 1:16 PM

Shruti Haasan New Year Resolution - Sakshi

దైవదూతలు స్నేహితుల రూపంలో వస్తారని శృతీహాసన్‌ బలంగా నమ్ముతున్నారు. ఎప్పట్నుంచి నమ్ముతున్నారు! ఎప్పట్నుంచో కాదు. గత ఏడాదిలో ఓ రోజు నుంచీ! ‘ఓ రోజు’ అంటున్నారు తప్పితే ఏ రోజో కచ్చితంగా చెప్పడం లేదు శృతి. ‘‘2019 లో నేనొకటి తెలుసుకున్నాను. మనం చిక్కుల్లో పడబోతున్నప్పుడు దైవదూతలు గమనించి, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా శృతి చెప్పారు. ఓ ప్రశ్న అంటే.. ఏ ప్రశ్న? ‘‘గత ఏడాది మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్న. ‘‘మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందీ అంటే అది.. మనల్ని మనం ప్రేమించుకోవడమే’’ అని ఆమె సమాధానం. ఆ సమాధానం తర్వాతే దైవదూతలు, స్నేహితులు అంటూ మాట్లాడారు శృతి. ఆమె ప్రేమ విఫలమైంది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం కావచ్చు.. ఆమెలోని ఈ తాత్వికత. ‘రేసుగుర్రం’ సినిమాలోని తన క్యారెక్టర్‌లా కూల్‌గా ఉంటూ కూల్‌గా మాట్లాడుతున్నారు శృతీహాసన్‌ గత రెండు రోజులుగా. ‘కూల్‌’ అనేది ఆమె చేసుకున్న కొత్త సంవత్సర తీర్మానంలా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement