కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్‌ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా!
ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే..
ద్రాక్ష ప్రేమను: స్పెయిన్, లాటిన్ అమెరిక దేశాలలో న్యూఇయర్ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్ తెగ నడుస్తోంది కూడా.
కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు. ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు.
చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా.
ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్‌ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్ గ్రీన్స్ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం.
నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్ రోజున న్యూడిల్స్ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు.
కేక్ లేదా డోనట్స్: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు.
(చదవండి: 'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్! వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment