
సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్తను అందించింది. మార్చి 19వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆ సేల్‌లో అందివ్వనున్న ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ తాజాగా వెల్లడించింది. మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్ జరగనుంది. ఈ నాలుగు రోజుల సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై ఆఫర్లు ఉన్నాయి.
ఈ సేల్‌కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్‌ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్‌లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి. మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్‌ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 15% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment