న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్‌ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్‌ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.
పీఎస్‌ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్‌లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment