50 కోట్ల డాలర్లకు స్నాప్‌డీల్ అమ్మకాలు ! | Snapdeal targets $1 bn sales by FY’15 | Sakshi
Sakshi News home page

50 కోట్ల డాలర్లకు స్నాప్‌డీల్ అమ్మకాలు !

Published Fri, Jan 10 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

50 కోట్ల డాలర్లకు స్నాప్‌డీల్ అమ్మకాలు !

50 కోట్ల డాలర్లకు స్నాప్‌డీల్ అమ్మకాలు !

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 50 కోట్ల డాలర్లకు చేరువ అవుతాయని దేశీయ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్ తెలిపింది. ఈ -కామర్స్ సెగ్మెంట్ జోరు కారణంగా 2015 మార్చి కల్లా తమ అమ్మకాలు వంద కోట్ల డాలర్లకు పెరుగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపిస్తోందని స్నాప్‌డీల్‌డాట్‌కామ్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) టోనీ నవీన్ చెప్పారు. వినియోగదారులు ఇప్పుడు మరింత నమ్మకంగా ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని, ఫలితంగా తమ అమ్మకాలు 4-5 రెట్ల వృద్ధిని సాధించాయని  పేర్కొన్నారు.
 
 అన్ని కేటగిరి వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని, అయితే ఎలక్ట్రానిక్స్, దుస్తుల అమ్మకాలు మరింత జోరుగా ఉన్నాయని వివరించారు. 2010, ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభించామని దాదాపు 2 కోట్ల మంది సభ్యులయ్యారని పేర్కొన్నారు. దాదాపు 500 రకాల కేటగిరిల్లో 20 వేల మంది విక్రయదారులు ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నారని, 4,000 నగరాల్లో డెలివరీలు ఇస్తున్నామని వివరించారు. రెండేళ్లలో అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement