మళ్లీ కోత
- రెండు విడతల్లో అమలు
- జనాలకు తప్పని అవస్థలు
- నేటి నుంచి ఇళ్లకు గంటలు కట్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలకు విద్యుత్ కోతల నుంచి ఉపశమనం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. నెల రోజులు తిరక్కుండానే విద్యుత్ వినియోగదారుల కష్టాలు మొదటికి వచ్చాయి. నగరంలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇటీవల వర్షాలు పడడంతో కొద్ది రోజుల పాటు నగరంలో విద్యుత్ కోతకు సెలవిచ్చిన సంగతి తెలిసిందే. మరి కొన్నాళ్ల పాటు ఇలాగే ఉంటుందని భావించిన నగర ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం 400-500 మెగవాట్ల లోటు నమోదవుతుండటంతో కోతలు అనివార్యమైనట్లు సదరన్ డిస్కం ప్రకటించింది. డిమాండ్, సరఫరాల మధ్య భారీ తేడా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది.
గురువారం నుంచి గ్రేటర్ పరిధిలోని 33/11కేవీ ఫీడర్ల వారీగా గృహాలకు ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు గంటల చొప్పున రోజుకు నాలుగు గంటల పాటు సరఫరా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రోజురోజుకు గృహాల్లో ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం మరింత పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొంది. అయితే ఈ కోతలు బుధవారం నుంచే అమలులోకి రావడం కొసమెరుపు.
ఫీడర్ల వారీగా కోతల వేళలు ఇలా....
ఉదయం 6-8 గంటలు...
మధ్యాహ్నం 12-2 గంటల మధ్య...
జెమ్స్‌స్ట్రీట్, క్లాక్ టవర్, బన్సీలాల్‌పేట్, కిమ్స్, మోండా మార్కెట్, పాటిగడ్డ, మారేడ్‌పల్లి, జింఖానా, అడ్డగుట్ట, హైదర్‌గూడ, నెహ్రూ నగర్, సీతాఫల్‌మండి, చిలకల్‌గూడ, లాలాగూడ, ఐఐసీటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రాగాటూల్స్, హెచ్‌ఏఎల్, ప్రశాంతినగర్, ఐడీపీఎల్, బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట, గన్‌రాక్, భూదేవినగర్, ఆర్పీనిలయం, హకీంపేట్, మచ్చబొల్లారం, హెచ్‌ఎంటీ, ఫీవర్ ఆస్పత్రి, విటల్‌వాడీ, అంబర్‌పేట్, దుర్గానగర్, నారాయణగూడ, బతుకమ్మకుంట, ఇండస్ట్రియల్ ఏరియా, విజయ్‌నగర్ కాలనీ, బాచుపల్లి, డీపీపల్లి, సూరారం, జీడిమెట్ల, మయూరీనగర్, వేమన కాలనీ, ఆనంద్‌బాగ్, నందనవనం, తుర్కయాంజాల్, చంపాపేట్, లెనిన్‌నగర్, వనస్థలిపురం, మామిడిపల్లి, మదీనాగూడ, మౌలాలి, వాజ్‌పేయినగర్, వినాయక్‌నగర్, మల్కాజ్‌గిరి, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి, సాకేత్, యాప్రాల్, సీఆర్‌పీఫ్.
ఉదయం 8-10...
మధ్యాహ్నం 2-4 గంటల మధ్య
ఎర్రమంజిల్, ఇందిరాపార్క్, జవ హర్‌నగర్, హైదర్‌గూడ, లేక్‌వ్యూ, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్క్, ఎగ్జిబిషన్, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కళాశాల, నిమ్స్, రోడ్ నెంబర్ 12, ఎల్వీప్రసాద్‌మార్గ్, రోడ్ నెంబర్ 22, రోడ్ నెంబర్ 2, జూబ్లీహిల్స్, మాదాపూర్, కల్యాణ్‌నగర్, యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, అయ్యప్పసొసైటీ, శ్రీనగర్‌కాలనీ, ఫిలింనగర్, గుడిమల్కాపూర్, ఏసీ గార్డ్స్, అసిఫ్‌నగర్, గో ల్కొండ, లంగర్‌హౌస్, టొలిచౌకి, మోతీమహల్, నాంపల్లి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, ఐజేఎం, చందానగర్, పాపిరెడ్డికాలనీ, గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ, నానక్‌రామ్‌గూడ, ఎల్ అండ్ టీ, సెజ్, కొత్తగూడ, కొత్తపేట, మోహన్‌నగర్, మారుతీనగర్, బండ్లగూడ, ఆటోనగర్, హయత్‌నగర్, రాజీవ్‌స్వగృహ, తట్టి అన్నారం, పెద్ద అంబర్‌పేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు, అబ్దుల్లాపూర్‌మెట్, రామోజీ ఫిలింసిటీ, నాగోల్, కొత్తపేట పండ్లమార్కెట్, భగత్‌సింగ్‌నగర్, తాండూర్, వికారాబాద్.
ఉదయం 10-12... సాయంత్రం 4-6 గంటల మధ్య: ఈఎన్‌టీ, ఘోషామహల్, కార్వాన్, ఉస్మానియా ఆస్పత్రి, సీతారాంబాగ్, సుల్తాన్‌బజార్, కోఠి ఉమెన్స్ కాలేజ్, సీఆర్‌పీఎఫ్, చందులాల్ బారాదరి, ఫలక్‌నూమా, కందికల్‌గేట్, కిలావత్, మీరాలం, పేట్లబురుజు, సాలార్జంగ్ మ్యూజియం, అత్తాపూర్, ఆస్మాన్‌ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, కంచన్‌బాగ్, ముసారంబాగ్, సంతోష్‌నగర్, ఆల్విన్, బేగంపేట్, ఎయిర్‌పోర్ట్, స్ట్రీట్‌నెం బర్ 8 (హబ్సీగూడ), ఐడీఏ ఉప్పల్, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, ట్రక్‌పార్క్, మైత్రీ వనం, మోతీనగర్, సంజీవయ్యపారు ్క, ఈఎస్‌ఐ, గ్రీన్‌లాండ్స్, కొంపెల్లి సుభాష్‌నగర్, ఉప్పర్‌పల్లి, ఇబ్రహీంబాగ్, అప్పా, ఎపీఏ, ఎండీపల్లి, ఎన్‌ఐఆర్‌డీ, కాటేదాన్, సీబీ ఐటీ, గగన్‌పహడ్, గందంగూడ.
వేసవిని తలపించేలా...
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతోంది. బుధవారం గరిష్టంగా 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 48 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా. రుతుపవనాల నిష్ర్కమణ సమయంలో ఆకాశం మేఘావృతం కాకపోవడం, ఆగ్నేయ దిశ నుంచి నగరం వైపు వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం సర్వసాధారణమేనని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోబరు మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, సుమారు 39 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వేసవి తాపాన్ని తలపిస్తున్నప్పటికీ వేసవితో పోలిస్తే ఈ ఉష్ణోగ్రతలు అత్యధికం కాదని విశ్లేషిస్తున్నారు.