
కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళ ఉద్యోగులు
పూలన్నీ పులకించి.. పుడమి తల్లి పరవశించేలా జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు హుషారుగా సాగాయి.
సంగారెడ్డి జోన్: పూలన్నీ పులకించి.. పుడమి తల్లి పరవశించేలా జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు హుషారుగా సాగాయి. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సంబురాలను ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. వయోజన విద్య, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి, జడ్పీ ఉద్యోగులు సంయుక్తంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతిక బతుకమ్మ పండుగ అని ఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో పోలీస్ మినీస్టిరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అనురాధ, మహిళ ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఊరూరా బతుకమ్మల సందడి కనిపించింది.