ముంబై: మహిళల్లో చెప్పుకోతగ్గ మంది వచ్చే రెండేళ్ల కాలంలో ఉద్యోగాలను మానేయాలని అనుకుంటున్నారు. పనిలో అలసిపోవడం, పని వేళలు అనుకూలంగా లేకపోవడం వారిని ఈ నిర్ణయం దిశగా నడిపిస్తున్నట్టు డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. కరోనా విపత్తు సమయంలో పెద్దఎత్తున ఉద్యోగాలు వీడిపోవడం (గ్రేజ్ రిజిగ్నేషన్) మహిళా ఉద్యోగుల్లో ఇంకా కొనసాగుతున్నట్టుందని డెలాయిట్ సర్వే నివేదిక ‘ఉమెన్స్ ఎట్ వర్క్ 2022’ తెలిపింది.
ఏడాది క్రితంతో పోలిస్తే తాము ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల స్థాయి పెరిగిపోయినట్టు 56 శాతం ఉద్యోగినులు తెలిపారు. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల పరిధిలో నిర్వహించిన ఈ సర్వేలో 5,000 మంది మహిళలు పాల్గొన్నారు.
పని ఒత్తిడితో అసలిపోవడమే మహిళలు ఉద్యోగాలను వదిలేద్దామనుకోవడానికి ప్రధాన కారణంగా ఉంది. 40 మంది ఇదే కారణంతో కొత్త సంస్థకు మారిపోదామని చూస్తున్నారు. సర్వేలో సగం మంది వచ్చే రెండేళ్లలో ప్రస్తుత సంస్థను విడిచిపెడతామని చెప్పారు. ప్రస్తుత సంస్థతో మరో ఐదేళ్లకు పైగా కొనసాగుతామని చెప్పిన వారు కేవలం 9 శాతంగానే ఉన్నారు.
కలుపుకుని పోవడం లేదు..
పని ప్రదేశాల్లో తమను కలుపుకుని పోవడం లేదన్నది మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల్లో ప్రముఖంగా ఉంది. కొద్ది మంది అంటే 24 శాతం మంది ఈ విషయాన్ని పనిచేసే సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తమ కెరీలో వృద్ధి అవకాశాల పట్ల ఏమంత ఆశావహంగా లేమని ఎక్కువ మంది చెప్పారు. హైబ్రిడ్ విధానంలో పనిచేసే వారు (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) ముఖ్యమైన సమావేశాలకు తమను పిలవడం లేదని భావిస్తున్నారు.
చదవండి👉వందల మంది ఉద్యోగుల రాజీనామా..దెబ్బకి దిగొచ్చిన కంపెనీ.. వారానికి 4 రోజులే పని!
Comments
Please login to add a commentAdd a comment