సాక్షి, న్యూఢిల్లీ: ప్రసూతి ప్రయోజన చట్టం శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులందరికీ వర్తిస్తుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగిని శ్వేతా పాఠక్ ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం ప్రయోజనాలు తనకు వర్తిసాయోలేదో చెప్పాలని తన సంస్థను, అప్పిలేట్ అధికారిని సమాచార హక్కు చట్టం కింద కోరంగా వారు స్పందించలేదు. దీంతో ఆమె సీఐసీని ఆశ్రయించారు. ఈ చట్టం శాశ్వత ఉద్యోగులతోపాటు, తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బందికి కూడా వర్తిస్తుందని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు స్పందించకపోవడమే కాకుండా సీపీఐవో, ప్రథమ అప్పిలేట్ అథారిటీ ప్రసూతి ప్రయోజన చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment