బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు | two women employees of bank foil robbery bid by armed men | Sakshi
Sakshi News home page

బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు

Published Tue, Apr 4 2017 2:13 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు - Sakshi

బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు

హరియాణాలోని గుర్‌గ్రామ్‌లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగినులు సాహసం ప్రదర్శించారు. తమ బ్యాంకును దోచుకోడానికి వచ్చిన ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాది, వాళ్లను స్థానికులకు అప్పగించారు. దాంతో వాళ్లు కూడా తమ చేతి బలాన్ని చూపించి, దోపిడీకి వచ్చినవాళ్లను చావగొట్టారు. ఇదెలా జరిగిందంటే.. ఇద్దరు యువకులు గుర్‌గ్రామ్‌లోని ఓ బ్యాంకును దోచుకోడానికి వచ్చారు. ఇద్దరిలో ఒకడు ఏమీ తెలియనట్లుగా ఏదో ఫారం నింపుతున్నట్లు నటించి కుర్చీలో కూర్చున్నాడు. మరొకడు వెనకాల బ్యాగ్ తగిలించుకుని వచ్చి, కాసేపు అతడితో మాట్లాడి తర్వాత బ్యాగ్ తెరిచి అందులో ఉన్న కత్తిని అవతలి వ్యక్తికి ఇచ్చి, తాను రివాల్వర్ పట్టుకున్నాడు.

ఇద్దరూ కలిసి ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు వెళ్లారు. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి దాంతో బెదిరిస్తుండగా కత్తి పట్టుకున్న వ్యక్తి దాంతో దాడి చేశాడు. కౌంటర్ల వద్ద ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోడానికి ఇద్దరూ ప్రయత్నించారు. కానీ మహిళా ఉద్యోగులు ఇద్దరూ వాళ్లను పట్టుకున్నారు. బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసేసి అడ్డంగా నిలబడ్డారు. అంతలో స్థానికులు కూడా లోపలకు వచ్చారు. అంతా కలిసి దుండగులు ఇద్దరినీ పట్టుకుని చేతికి అందిన వస్తువులతో వాళ్లను చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement