bank robbery bid
-
ఉగ్రవాదుల బరితెగింపు..
- కొత్త నోట్ల కోసం బ్యాంకు దోపిడీ యత్నం అనంతనాగ్: పాత నోట్ల రద్దు..ఉగ్రవాద,తీవ్రవాద కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందన్న మాట నిజమని మరోసారి రుజువైంది. తమ కార్యక్రమాల విస్తరణ కోసం కొత్త నోట్లు అవసరమైన ఉగ్ర సంస్థలు ఏకంగా బ్యాంకులనే టార్గెట్ చేసుకున్నాయి. శుక్రవారం కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకున్న దోపిడీ యత్నం ఉగ్రవాదుల బరితెగింపును వెలుగులోకి తెచ్చేదిలా ఉంది. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్ లోని బ్యాంకులపై జరిగిన ఐదో దాడి ఇది. అనంత్ నాగ్ జిల్లా కేంద్రంలోని ఒక బ్యాంకును కొట్టగొట్టేందుకు సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముష్కరులు తోకముడవక తప్పలేదు. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడిని చెరపట్టగా, మరొకడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు తుపాకి పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ యత్నం చేసిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సిఉంది. కాగా, జనవరిలో ఇదే అనంత్ నాగ్ పట్టణంలో దుండగులు ఎటీఎంను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ బ్యాంక్ కు చెందిన ఆ ఏటీఎంలో రూ.14 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటివే మరో రెండు ఘటనలూ చోటుచేసుకున్దేనాయి. ఆ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే నేడు మరో దోపిడీ ఘటన చోటుచేసుకోవడం కశ్మీర్ లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతాప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. -
బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు
-
బ్యాంకు దొంగలకు చుక్కలు చూపించిన మహిళలు
హరియాణాలోని గుర్‌గ్రామ్‌లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగినులు సాహసం ప్రదర్శించారు. తమ బ్యాంకును దోచుకోడానికి వచ్చిన ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాది, వాళ్లను స్థానికులకు అప్పగించారు. దాంతో వాళ్లు కూడా తమ చేతి బలాన్ని చూపించి, దోపిడీకి వచ్చినవాళ్లను చావగొట్టారు. ఇదెలా జరిగిందంటే.. ఇద్దరు యువకులు గుర్‌గ్రామ్‌లోని ఓ బ్యాంకును దోచుకోడానికి వచ్చారు. ఇద్దరిలో ఒకడు ఏమీ తెలియనట్లుగా ఏదో ఫారం నింపుతున్నట్లు నటించి కుర్చీలో కూర్చున్నాడు. మరొకడు వెనకాల బ్యాగ్ తగిలించుకుని వచ్చి, కాసేపు అతడితో మాట్లాడి తర్వాత బ్యాగ్ తెరిచి అందులో ఉన్న కత్తిని అవతలి వ్యక్తికి ఇచ్చి, తాను రివాల్వర్ పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు వెళ్లారు. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి దాంతో బెదిరిస్తుండగా కత్తి పట్టుకున్న వ్యక్తి దాంతో దాడి చేశాడు. కౌంటర్ల వద్ద ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోడానికి ఇద్దరూ ప్రయత్నించారు. కానీ మహిళా ఉద్యోగులు ఇద్దరూ వాళ్లను పట్టుకున్నారు. బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసేసి అడ్డంగా నిలబడ్డారు. అంతలో స్థానికులు కూడా లోపలకు వచ్చారు. అంతా కలిసి దుండగులు ఇద్దరినీ పట్టుకుని చేతికి అందిన వస్తువులతో వాళ్లను చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది.