సాక్షి, విజయనగరం : జిల్లాలోని జీఎస్టీ కార్యాలయ ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ ముగ్గురు మహిళా ఉద్యోగులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆమె జీఎస్టీ కార్యాలయానికి వచ్చి విచారించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేస్తున్నారని, అడిగితే వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగినీలు వాపోయారు.
లైంగింక వేధింపులపై మహిళా ఉద్యోగులను ఆరా తీయగా.. క్లోజ్డ్ గదితో చెబుతామని పేర్కొన్నారు. ఏకాంత గదిలోకి వెళ్లి మహిళా ఉద్యోగులను విచారించారు. అనంతరం నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగపరంగా మాత్రమే వేధింపులు ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మహిళా అధికారులకు హైవేపై నైట్ డ్యూటీలు వేయకూడదని, కానీ ఇక్కడి జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ నైట్ డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణకు వస్తున్నానని తెలిసినా.. జాయింట్ కమిషనర్ అందుబాటులో లేడన్నారు. ముగ్గురు మహిళా అధికారులకు నైటీ డ్యూటీలు, సండే డ్యూటీలు వేయకూడదని ఆదేశాలు జారీ చేసున్నానని నన్నపనేని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment