పెళ్లయిన ఆరు నెలలకే...
కొన్ని సందర్భాల్లో ఆమెను శారీరకంగా హింసకు గురి చేసేవారు. వినాయక చవితి పండగకి వారం రోజుల క్రితం రాజేశ్వరి కన్నవారింటికి వెళ్లింది. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నెల్లిమర్ల విచ్చేసింది. వచ్చిన దగ్గరనుంచీ అత్త, ఆడపడుచులు తిట్టడం మొదలుపెట్టారు. రాజేశ్వరిని పెద్దగా నోరేసుకుని తిడుతున్నట్లు చుట్టుపక్కల వారికి వినిపించినప్పటికీ అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇంతలోనే ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే రాజేశ్వరి మృతి చెందింది. ఒళ్లంతా కాలిపోయి బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉంది. పక్కనే కిరోసిన్ డబ్బా ఉంది. ఆ దృశ్యం చూసే వారికి హృదయవిదారకంగా అనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చి బోరుమన్నారు. తమ కూతురిని అత్తవారే కాల్చిచంపారని రోదించారు. గుర్ల ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.