చికిత్స పొందుతున్న గౌతమ్, దుర్గ( ఫైల్)
సాక్షి,విజయనగరం: విజయనగరం శివారు జమ్మునారాయణపురంలోని సాయిదత్త కుటీర్‌లో కుటుంబంతో నివాసముంటున్న ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గ్యాస్ లీక్ చేసుకుని నిప్పంటించుకోవడంతో తల్లీబిడ్డలు ముగ్గురూ మంటల్లో సగానికి పైగా కాలిపోయారు. ఇంట్లోని కిటికీల్లోంచి పొగలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు పరుగులు తీసి వారిని కాపాడారు. అప్పటికే తల్లీబిడ్డలు అగి్నకీలలకు విలవిల్లాడుతుండగా హుటాహుటిన వారిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. ( చదవండి: వేకువన పెళ్లి.. సాయంత్రం ప్రమాదం )
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో పని చేస్తున్న గుమ్మ సింహాచలం జమ్మునారాయణపురంలోని సాయిదత్త కుటీర్‌లో భార్య దుర్గ (27), బాబు గౌతమ్ (6), పాప మోక్షశ్రీ (4)లతో నాలుగేళ్లుగా నివాసముంటున్నారు. సింహాచలానికి విజయవాడకు చెందిన దుర్గతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. నాలుగు నెలల క్రితం వరకూ దుర్గ విజయవాడలోనే తల్లిదండ్రుల వద్దనే ఉంది. ఇటీవల 20రోజుల క్రితం భర్త వద్దకు పిల్లలతో వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటలకు యథావిధిగా సింహాచలం అరబిందో కంపెనీకి విధి నిర్వహణకు వెళ్లిపోయాడు. 7.30 గంటల ప్రాంతంలో ఇంట్లోని కిటికీల్లోంచి మంటలు, భారీగా పొగలు రావడంతో గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు తలుపులు బాదగా మంటల్లో కాలుతూనే దుర్గ తలుపుతీసింది. కాలిపోతున్న తల్లీబిడ్డల మంటలను వారు ఆర్పి హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
నిద్రలోనే కాలిపోయిన పిల్లలు
సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి చూడగా, ఉదయం సమయంలో బెడ్‌రూంలో పిల్లలు పడుకున్న సమయంలో, తల్లి దుర్గ గ్యాస్ సిలిండర్ బెడ్‌రూంలోకి తీసుకువచ్చి, పిల్లలతో పాటు తగులబెట్టుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కార ణాలు స్పష్టంగా తెలియరాలేదని, విచారణ చేపట్టా మని రూరల్ ఎస్సై నారాయణరావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment