సచివాలయ మహిళా ఉద్యోగిని బెదిరించిన టీడీపీ నేత
సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్
ఘటనపై స్పందించిన మహిళా కమిషన్
సాక్షి, అమరావతి/నల్లజర్ల: సచివాలయ మహిళా ఉద్యోగిపై తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నేత మైనం చంద్రశేఖర్ బెదిరింపులకు దిగారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ మహిళా ఉద్యోగిని తన ఇంటికి రావాలని చంద్రశేఖర్ ఆదేశించాడు. రాకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మనగా.. ఆ ఉద్యోగి ఏదైనా మాట్లాడాలంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని మర్యాద పూర్వకంగా జవాబిచ్చింది.
‘నాకు సచివాలయానికి వచ్చే పనిలేదు. నువ్వే మా ఇంటికి రావాలి’ అని చంద్రశేఖర్ అనగా.. ‘ఇంటికి ఎలా వస్తామండి’ అని ఆ ఉద్యోగిని సమాధానమిచ్చింది. ‘ఫర్వాలేదమ్మా మీరు గ్రామస్థాయి ఉద్యోగులే కదా.. ఫర్వాలేదు. మీరేం మండల స్థాయి అధికారులు కాదు కదా. మా దగ్గరకురావడానికి నామోïÙగా ఉందా? మాట్లాడే పని ఉందమ్మా’ అని అతడు అన్నాడు. ఏదైనా ఉంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని ఆమె సూచించగా.. ‘సచివాలయానికి రావాల్సిన పని నాకు లేదు.
టీడీపీ నెగ్గిన వెంటనే ఒకసారి చెప్పాను. మా ఊళ్లో ఉద్యోగం చేయాలంటే మా ఇంటికి రావాల్సిందే. నీ ఫోన్‌లో ఈ విషయాలన్నీ రికార్డింగ్ అవుతాయా? రికార్డు చేసి నువ్వు మీపై అధికారులకు కూడా చెప్పు. మీరేం ఊరికి మొగాళ్లేం కాదు. ఈ ఆడియో ఈ గ్రామంలోని వైఎస్సార్ సీపీ మెయిన్ నాయకులకు, అధికారులకు పంపు’ అంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment