
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.
కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త