ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ కొనసాగుతారు
టాటా సన్స్ వెల్లడి
ముంబై: టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ టాటా కొనసాగుతారని, ప్రస్తుతానికి తప్పుకునే యోచనేదీ ఆయనకు లేదని టాటా సన్స్ వెల్లడించింది. చైర్మన్‌గా ఆయన తప్పుకోనున్నారంటూ వార్తలు వచ్చిన దరిమిలా టాటాసన్స్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘టాటా ట్రస్ట్‌ల చైర్మన్ హోదా నుంచి తప్పుకునే యోచనేదీ లేదని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు’ అని వివరించింది. జాతీయ స్థాయిలో ప్రయోజనంచేకూర్చేలా టాటా ట్రస్ట్‌లు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటిల్లో పాలుపంచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాటా సన్స్ తెలిపింది.
అయితే, తదుపరి బాధ్యతల బదలాయింపు సులువుగా ఉండేలాతగు వారసత్వ ప్రణాళికలు ఉండాలని టాటా యోచిస్తున్నట్లు వివరించింది. హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు 66% వాటాలు ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వానసకు గురైన సైరస్ మిస్త్రీ,రతన్ టాటాల మధ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో టాటా ట్రస్ట్‌ల పాత్ర కీలకంగా మారింది. టాటా సన్స్ చైర్మన్‌గా రిటైరైన తర్వాత కూడా ట్రస్ట్‌లను ఉపయోగించుకుని మొత్తం గ్రూప్‌పై రతన్ టాటా ఆధిపత్యంచలాయిస్తున్నారని మిస్త్రీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
వాడియా అంశంపై ఈజీఎంలకు లైన్ క్లియర్..
స్వతంత్ర డైరెక్టరుగా నుస్లీ వాడియాను తొలగించే దిశగా టాటా గ్రూప్ సంస్థలు అసాధారణ సర్వ సభ్య సమావేశాలు (ఈజీఎం) నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. వీటిలో ప్రమోటర్లు ఓటింగ్ చేయకుండాఆదేశించాలంటూ మైనారిటీ షేర్‌హోల్డర్లు వేసిన పిటీషన్‌పై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, తదుపరి ఉత్తర్వుల వరకూ బోర్డులో ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాలను భర్తీచేయొద్దంటూ టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ సంస్థలను ఆదేశించింది. షేర్‌హోల్డర్ల పిటీషన్ మీద జనవరి 15లోగా వివరణ దాఖలు చేయాలని టాటా సన్స్‌కు సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కువాయిదా వేసింది. డిసెంబర్ 21 నుంచి 23 దాకా ఈజీఎంలు జరగనున్నాయి.
టాటా సంస్థల షేర్ల వెంట ఫండ్స్..
టాటా గ్రూప్‌లో ఇటీవలి పరిణామాలతో కరెక్షన్‌కు లోనైన టాటా సంస్థల షేర్లను మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నాయి. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలునెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. అన్నింటికన్నా అత్యధికంగా టాటా మోటార్స్‌లో 1.38 కోట్ల షేర్ల కొనుగోళ్లు జరిగాయి. ఇది క్రితం నెలతో పోలిస్తే 11 శాతం అధికం. ఇక టాటా పవర్‌లో ఇన్వెస్టర్లు అదనంగా8.36 శాతం వాటాలు, టాటా స్టీల్‌లో 8.17 శాతం మేర వాటాలు కొనుగోలు చేశారు.