Trust Chairman
-
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్‌ఆర్‌తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్ సేవలు
సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్ సపోర్ట్ కలిగిన ప్రత్యేక అంబులెన్స్‌ను అందించారు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్ గౌడ్. 24 గంటల పాటు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్‌కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్ గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత -
ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ కొనసాగుతారు
టాటా సన్స్ వెల్లడి ముంబై: టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ టాటా కొనసాగుతారని, ప్రస్తుతానికి తప్పుకునే యోచనేదీ ఆయనకు లేదని టాటా సన్స్ వెల్లడించింది. చైర్మన్‌గా ఆయన తప్పుకోనున్నారంటూ వార్తలు వచ్చిన దరిమిలా టాటాసన్స్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘టాటా ట్రస్ట్‌ల చైర్మన్ హోదా నుంచి తప్పుకునే యోచనేదీ లేదని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు’ అని వివరించింది. జాతీయ స్థాయిలో ప్రయోజనంచేకూర్చేలా టాటా ట్రస్ట్‌లు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటిల్లో పాలుపంచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాటా సన్స్ తెలిపింది. అయితే, తదుపరి బాధ్యతల బదలాయింపు సులువుగా ఉండేలాతగు వారసత్వ ప్రణాళికలు ఉండాలని టాటా యోచిస్తున్నట్లు వివరించింది. హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు 66% వాటాలు ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వానసకు గురైన సైరస్ మిస్త్రీ,రతన్ టాటాల మధ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో టాటా ట్రస్ట్‌ల పాత్ర కీలకంగా మారింది. టాటా సన్స్ చైర్మన్‌గా రిటైరైన తర్వాత కూడా ట్రస్ట్‌లను ఉపయోగించుకుని మొత్తం గ్రూప్‌పై రతన్ టాటా ఆధిపత్యంచలాయిస్తున్నారని మిస్త్రీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వాడియా అంశంపై ఈజీఎంలకు లైన్ క్లియర్.. స్వతంత్ర డైరెక్టరుగా నుస్లీ వాడియాను తొలగించే దిశగా టాటా గ్రూప్ సంస్థలు అసాధారణ సర్వ సభ్య సమావేశాలు (ఈజీఎం) నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. వీటిలో ప్రమోటర్లు ఓటింగ్ చేయకుండాఆదేశించాలంటూ మైనారిటీ షేర్హోల్డర్లు వేసిన పిటీషన్‌పై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, తదుపరి ఉత్తర్వుల వరకూ బోర్డులో ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాలను భర్తీచేయొద్దంటూ టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ సంస్థలను ఆదేశించింది. షేర్‌హోల్డర్ల పిటీషన్ మీద జనవరి 15లోగా వివరణ దాఖలు చేయాలని టాటా సన్స్‌కు సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కువాయిదా వేసింది. డిసెంబర్ 21 నుంచి 23 దాకా ఈజీఎంలు జరగనున్నాయి. టాటా సంస్థల షేర్ల వెంట ఫండ్స్.. టాటా గ్రూప్‌లో ఇటీవలి పరిణామాలతో కరెక్షన్కు లోనైన టాటా సంస్థల షేర్లను మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నాయి. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలునెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. అన్నింటికన్నా అత్యధికంగా టాటా మోటార్స్‌లో 1.38 కోట్ల షేర్ల కొనుగోళ్లు జరిగాయి. ఇది క్రితం నెలతో పోలిస్తే 11 శాతం అధికం. ఇక టాటా పవర్లో ఇన్వెస్టర్లు అదనంగా8.36 శాతం వాటాలు, టాటా స్టీల్‌లో 8.17 శాతం మేర వాటాలు కొనుగోలు చేశారు. -
షిర్డి ఆలయ చైర్మన్ పదవి బీజేపీకి!
షిర్డి: షిర్డిలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ పదవిని బీజేపీకి కట్టబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముంబై లో ప్రఖ్యాతిగాంచిన సిద్ధివినాయక దేవాలయం చైర్మన్ పదవి శివసేన పార్టీకి దక్కనున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చిం దని రాష్ట్రమంత్రి రామ్ షిండే శనివారం మీడియాతో అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలయ్యాక ఆలయాల ట్రస్టీల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. షిర్డి సాయిబాబా సమాధి చెంది 2018నాటికి వందేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా అప్పుడు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ నిధులను కేటాయించాల్సి ఉందని ఆయన అన్నారు. నిలిచిపోయిన షిర్డి రహదారుల పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.