షిర్డి ఆలయ చైర్మన్ పదవి బీజేపీకి!
షిర్డి: షిర్డిలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ పదవిని బీజేపీకి కట్టబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముంబై లో ప్రఖ్యాతిగాంచిన సిద్ధివినాయక దేవాలయం చైర్మన్ పదవి శివసేన పార్టీకి దక్కనున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చిం దని రాష్ట్రమంత్రి రామ్ షిండే శనివారం మీడియాతో అన్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలయ్యాక ఆలయాల ట్రస్టీల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. షిర్డి సాయిబాబా సమాధి చెంది 2018నాటికి వందేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా అప్పుడు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ నిధులను కేటాయించాల్సి ఉందని ఆయన అన్నారు. నిలిచిపోయిన షిర్డి రహదారుల పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.