విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్‌ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్‌కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్‌లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది.
విస్తారా వెబ్‌సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్‌సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది.
(చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!)
Comments
Please login to add a commentAdd a comment