భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు | Tata Sons FY16 profit falls 67 per cent to Rs 3,013 crore | Sakshi
Sakshi News home page

భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు

Published Mon, Oct 31 2016 8:36 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు - Sakshi

భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు

ముంబై : చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బయటికి నెట్టేసి టాటా సన్స్, అసలు తమ గ్రూప్ లాభాలు ఏమేరకు ఉన్నాయా? అని లెక్కలేసుకుంది. ఈ లెక్కలో టాటా సన్స్ భారీగానే లాభాలను కోల్పోయింది. ఈ ఏడాది మార్చి వరకు టాటా సన్స్ లాభాలు 67 శాతం కుదేలై, రూ.3,013 కోట్లగా నమోదైనట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్లో పేర్కొంది. మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం కూడా ఆయన పనితీరు సరిగా లేదనే గ్రూప్ చెబుతోంది.  అదేవిధంగా రెవెన్యూలు కూడా 39 శాతం క్షీణించి రూ.8,104 కోట్లగా నమోదుచేసింది.
 
కానీ ఏకీకృత ప్రాతిపదికన మాత్రం కంపెనీ గతేడాదితో పోలిస్తే కొంత మెరుగైన లాభాలనే ఆర్జించింది. గతేడాది రూ.19,180 కోట్లగా ఉన్న లాభాలను రూ.23,119 కోట్లకు పెంచుకుంది. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తీసివేసిన తర్వాత ఆ పదవికి తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను బోర్డు ఎన్నుకుంది. గ్రూప్ వృద్ధిని పెంచడానికి రతన్ టాటా తమ స్ట్రాటజీలను మరోసారి పరిశీలిస్తున్నారని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. గత ఆర్థికసంవత్సరం టీసీఎస్ కంపెనీ చెల్లించిన ఎక్కువ డివిడెంట్లు కూడా స్వతంత్ర ఆదాయాలకు కొంత గండికొట్టినట్టు తెలిసింది.  గతేడాది కంపెనీ డివిడెంట్లు కింద రూ.11,450 కోట్లను చెల్లించింది. కంపెనీ స్వతంత్ర ఆదాయాలకు, ఏకీకృత ఆదాయాకు పెద్దగా తేడా లేనప్పటికీ, లాభాల్లో మాత్రం కంపెనీ పడిపోయింది.  
 
దీంతో మిస్త్రీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బోర్డు సభ్యులు ... చైర్మన్ పదవికి ఎన్నికై నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు మిస్త్రీ స్థానంలో ఎన్నికైన రతన్ టాటా, కంపెనీ అధినేతలందరికీ తమతమ వ్యాపారాలపై దృష్టిసారించాలని ఉపదేశం చేశారు. పనితీరుతో పాటు, లాభాలను పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement