సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్‌ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. టాటా సన్స్ అంతర్గత బృందం జెట్ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలును మదింపు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరికొన్ని వారాలు సాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు పేర్కొంది.
మరోవైపు వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలు ప్రకటించిన జెట్ ఎయిర్‌వేస్ లాభదాయకం కాని రూట్లలో విమానాలను తగ్గిస్తామని, లాభదాయ రూట్లలో సామర్థ్య పెంపు చేపడతామని పేర్కొంది.
ఖర్చులు తగ్గించుకుని, ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు జెట్ ఎయిర్‌వేస్ యోచిస్తోంది. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ పెరుగుతున్న చమురు ధరలు, ఇంధన పన్నులు, క్షీణిస్తున్న రూపాయి విలువతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment