takeover offer
-
Elon Musk: పాయిజన్ పిల్‌కు మొగ్గు చూపుతున్న ట్విటర్ బోర్డు!
ఫ్రీ స్పీచ్ ఫ్లాట్‌ఫామ్ కావాలంటూ ఏకంగా ట్విటర్ కొనేస్తానంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేసిన భారీ ఆఫర్‌కి గట్టి కౌంటర్ ఇచ్చే పనిలో పడింది ట్విటర్ బోర్డు. ఆలస్యం చేసే కొద్ది ఎలన్‌మస్క్ నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుండంతో ఈ కౌంటర్ స్ట్రాటజీని త్వరగా పట్టాలెక్కించే పనిలో పడింది. అరుదైన ఎత్తుగడ ఎట్టి పరిస్థితుల్లో ఎలన్‌మస్క్ ఎత్తులు పారకుండా చూసేందుకు ట్విటర్ బోర్డు కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. కార్పొరేట్ కంపెనీలు చాలా అరుదుగా ఉపయోగించే పాయిజన్ పిల్ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీనిపై ట్విటర్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. అంతర్గతంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాయిటజ్ పిల్ పాయిజన్ పిల్ విధానంలో కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్లకు డిస్కౌంట్ ధరకే మరిన్ని షేర్లను కేటాయిస్తారు. దీని వల్ల కంపెనీలో షేర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. షేర్ల సంఖ్య పెరిగిపోవడంతో కొనుగోలు విలువ కూడా పెరుగుతుంది. ఫలితంగా కంపెనినీ టేకోవర్ చేయాలని భావించే వ్యక్తి/సంస్థకు ఆసక్తి తగ్గిపోతుంది. చాలా అరుదుగా ఈ పాయిజన్ పిల్‌ను ఉపయోగిస్తారు. ఆసక్తి పోయేలా ట్విటర్‌కు సంబంధించినంత వరకు మేజర్ షేర్ హోల్డర్ గరిష్ట వాటా 15 శాతం మించడానికి వీలులేదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి / సంస్థ 15 శాతం వాటాను మించి ఇంకా షేర్లు కావాలని కోరితే ఆ వ్యక్తి/సంస్థను మినహాయించి, మిగిలిన షేర్ హోల్డర్లందరికీ పాయిజన్ పిల్ విధానంలో డిస్కౌంట్ ధరకే షేర్ల కేటాయింపు జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఎలన్‌మస్క్ ఆఫర్ చేసిన 43.4 బిలియన్ డాలర్ల మొత్తం కూడా ట్విటర్ కొనుగోలు చేసేందుకు సరిపోదు. ఫలితంగా మరింత సొమ్ము వెచ్చించడమా లేక వెనక్కి తగ్గడమా అన్నది ఎలన్‌మస్క్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్లకి ఇష్టం లేదు టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌మస్క్ ఇటీవల ట్విటర్లో 9.2 శాతం షేర్లను కొనుగోలు చేసి మేజర్ షేర్‌హోల్డర్‌గా మారాడు. అయితే బోర్డు సభ్యుడిగా ఉండేందుకు నిరాకరించాడు. ఆ వెంటనే ట్విటర్‌ను కొనుగోలు కోసం 43.4 బిలియన్ డాలర్లు ఇస్తానంటూ భారీ ఆఫర్ చేశాడు. ఎలన్‌మస్క్ ఆఫర్‌పై రిటైల్ ఇన్వెస్టర్లు కొంత మేర ఆసక్తిగా ఉన్నా ట్విటర్ బోర్డు, ఎంప్లాయిస్ ఇంట్రస్ట్ చూపెట్టడం లేదు. దీంతో ఎలన్‌మస్క్ తనంతట తానుగా ట్విటర్‌పై ఆసక్తి క్ల్పపోయేలా చేసేందుకు చాలా ఆరుదుగా ఉపయోగించే మార్గాన్ని ఎంచుకోవాలని చూస్తోంది. చదవండి: ఎలన్ మస్క్ భారీ ఆఫర్‌కి ఉద్యోగుల స్పందన ఇలా.. -
మైండ్ ట్రీకి ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా మైండ్ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్ ట్రీ షేర్ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్ చేస్తోంది. ఈ ఓపెన్ ఆఫర్ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ ఓపెన్ ఆఫర్ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్ ఆఫర్లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్– లైట్ సర్వీసెస్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్ ట్రీ కంపెనీని ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.10,700 కోట్లు... ఎల్ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్ ట్రీలో 35.15 శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్ అండ్ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది. -
టాటా సన్స్ చేతికి జెట్ ఎయిర్వేస్..?
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. టాటా సన్స్ అంతర్గత బృందం జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటా కొనుగోలును మదింపు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరికొన్ని వారాలు సాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు పేర్కొంది. మరోవైపు వరుసగా మూడో క్వార్టర్లోనూ నష్టాలు ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ లాభదాయకం కాని రూట్లలో విమానాలను తగ్గిస్తామని, లాభదాయ రూట్లలో సామర్థ్య పెంపు చేపడతామని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకుని, ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ పెరుగుతున్న చమురు ధరలు, ఇంధన పన్నులు, క్షీణిస్తున్న రూపాయి విలువతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ బిగ్ డీల్
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే చెప్పింది. గతవారం ఫ్లిప్‌కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,850 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల(రూ.6,175 కోట్లు) టేక్ఓవర్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ బోర్డు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక ఈ డీల్‌ను స్నాప్‌డీల్ షేర్ హోల్డర్స్ ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్‌డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్‌కార్ట్ తన ఆఫర్‌ను సవరించింది. ఈ వారంలోనే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు సమావేశం కాబోతున్నారని, టర్మ్‌షీట్‌పై సంతకాలు చేసి, డీల్‌ను ఓకే చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు పార్ట్‌లలో డీల్‌ను పూర్తిచేయబోతున్నారని తెలుస్తోంది. తొలుత స్నాప్‌డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంకు వాటాను కొనుగోలుచేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్‌ను సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం కాబోతున్నాయి. శుక్రవారం రోజు సమావేశమయ్యే ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు ఈ డీల్‌ను ఆమోదించబోతున్నారు. టర్మ్‌షీట్ మీద సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ డీల్ ప్రక్రియను ముగించాలని కంపెనీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంకు 20 శాతం వాటాని కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్‌డీల్ బ్రాండు పేరును ఫ్లిప్‌కార్ట్ అలానే కొనసాగించనుంది.