ముంబై: టాటా గ్రూపు కీలకనియామకాన్ని చేపట్టింది. టాటా సన్స్ చీఫ్ ఎకానమిస్ట్‌గా రూపా పురుషోత్తంను నియమించింది. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
టాటా సన్స్ తన ప్రధాన ఆర్ధికవేత్తగా, పాలసీ అడ్వకసీగా రూప్ పురుషోథామాన్ నియామకాన్ని గురువారం ప్రకటించింది. టాటూ గ్రూపు వ్యాపారాలకు సంబంధించి రూపా పురుషోత్తం మాక్రో ఎకానమికస్‌రీసెర్చ్, అలాగే అన్ని విధాన, న్యాయవాద కార్యక్రమాలు నిర్వహిస్తారని టాటా సన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమెకు సుదీర్ఘమైన అనుభవం ఉందనీ, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలపై పరిశోధనలతో అనేక రీసెర్చ్ పేపర్లను ప్రచురించినట్టు తెలిపింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ, "ఆర్ధిక విషయాలపై, పోకడలు, ప్రజా విధానం, న్యాయవాదలపై రూపా యొక్క లోతైన జ్ఞానం ఎంతో విలువైనది. సామాజిక రంగంలో తన అభిరుచి ,చొరవ తమకుఎంతో ఉపయోగపడుతుందన్నారు.
తన నియామకంపై రూప పురుషోత్తం స్పందిస్తూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన , బహుముఖ పాత్రను పోషిస్తున్న వాటిల్లో టాటా గ్రూప్ ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో టాటా గ్రూప్‌లో చేరడం నిజంగా ఒక ప్రత్యేక అవకాశమని వ్యాఖ్యానించారు.
కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, యాలే యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన రూప గతంలో గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ లో వైస్ ప్రెసిడెంట్ , ప్రపంచ ఆర్థికవేత్తగా పనిచేశారు.