టాటా సన్స్ మిస్త్రీపై చేసిన తాజా ఆరోపణలపై ఆయన వర్గం తీవ్రంగా మండిపడింది.
టాటా సన్స్ ఆరోపణలపై మిస్త్రీ వర్గం ఫైర్
ముంబై: టాటా సన్స్ మిస్త్రీపై చేసిన తాజా ఆరోపణలపై ఆయన వర్గం తీవ్రంగా మండిపడింది. టాటా సన్స్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. ‘చైర్మన్ పదవి నుంచి అన్యాయంగా, ఎలాంటి వివరణా కోరకుండా తొలగించిన తర్వాత 17 రోజుల పాటు దీనిపై టాటాలు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థంపర్థంలేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ కూడా మా (మిస్త్రీ) వివరణ తీసుకోకుండా సహజ న్యాయాన్ని ఉల్లంఘిస్తూ అర్థంతరంగా తొలగించాల్సి వచ్చిందనేదానిపై సరైన సమాధానమివ్వటం లేదేం?’’ అని మిస్త్రీ సన్నిహిత వర్గాలు విమర్శించారుు.
టాటా సన్స్ తాజా లేఖలో కేవలం కొన్ని అంశాలనే ప్రస్తావించారని.. వాస్తవాలు కూడా దాచిపెట్టారని స్పష్టం చేశారుు. కాగా, టీసీఎస్ గణాంకాలను వదిలేసి.. మిస్త్రీ పనితీరు బాగోలేదని విమర్శలు గుప్పించడం.. టాటా మోటార్స్ భారత్ వ్యాపారం దెబ్బతినడానికి ఆయనే కారణమని ఆరోపించడాన్ని కూడా మిస్త్రీ వర్గాలు ప్రస్తావించారుు. కావాలనే టాటా సన్‌స వివక్షాపూరితంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారుు.