
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తీర్పుపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్ కోరుతోంది. మరికొన్ని రోజుల్లో టీసీఎస్ బోర్డు సమావేశంజరగనున్న నేపథ్యంలోదీనిపై తక్షణమే స్టే తెచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. అయితే ఇటీవలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి జనవరి 6న వాదనలు విననుందని అంచనా.
మరోవైపు జనవరి 9న బోర్డు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా టీసీఎస్ కూ3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. టాటా సన్స్ అప్పీల్‌ను సైరస్ మిస్త్రీ, అతని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సైరస్ కుటుంబం డిమాండ్ చేయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి క్వార్టర్ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయముంటుందని, టాటా సన్స్‌కు ఫిబ్రవరి వరకు సుప్రీం నిర్ణయం కొరకు వేచి చూసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌ఆర్ అసోసియేట్స్ ప్రతినిథి మహాపత్ర పేర్కొన్నారు. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించి, కొన్ని నెలల తరువాత ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: ఇది విలువలు సాధించిన విజయం..
Comments
Please login to add a commentAdd a comment