syrus misthry
-
మిస్త్రీ వివాదం: వాడియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసును ఉపసంహరించుకోవాలని బాంబై డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా నిర్ణయించారు. రతన్ టాటా సహా ఇతరులపై రూ. 3వేల కోట్ల విలువైన పరువు నష్టం దావాలున్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ కేసులను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే టాటా, వాడియాలను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ .3,000 కోట్లు పరిహారం కోరుతో 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు. 2019 జూలైలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తన తొలగింపుపై సూరస్ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీ వివాదం : సుప్రీంకోర్టుకు టాటా సన్స్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీర్పుపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్ కోరుతోంది. మరికొన్ని రోజుల్లో టీసీఎస్ బోర్డు సమావేశంజరగనున్న నేపథ్యంలోదీనిపై తక్షణమే స్టే తెచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. అయితే ఇటీవలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి జనవరి 6న వాదనలు విననుందని అంచనా. మరోవైపు జనవరి 9న బోర్డు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా టీసీఎస్ కూ3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. టాటా సన్స్ అప్పీల్‌ను సైరస్ మిస్త్రీ, అతని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సైరస్ కుటుంబం డిమాండ్ చేయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి క్వార్టర్ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయముంటుందని, టాటా సన్స్‌కు ఫిబ్రవరి వరకు సుప్రీం నిర్ణయం కొరకు వేచి చూసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌ఆర్ అసోసియేట్స్ ప్రతినిథి మహాపత్ర పేర్కొన్నారు. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించి, కొన్ని నెలల తరువాత ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఇది విలువలు సాధించిన విజయం.. -
తెలంగాణకు ‘టాటా’ పవర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు టాటా పవర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. నిరర్థక భూముల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం బయోమాస్ అభివృద్ధికీ ఆసక్తిని కనబరించింది. పవన విద్యుత్‌ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా పరిశీలి స్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను టాటా గ్రూప్ చైర్మన్ సైర స్ మిస్త్రీకి మంత్రి కె.తారకరామారావు వివరించారు. మంగళవారం ముంబైలోని ముంబై హౌస్‌లో టాటా గ్రూప్ సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానా న్ని మంత్రి వివరించారు. వాటర్‌గ్రిడ్, టి- హబ్, ఆర్ఐసీహెచ్, పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీలు, సోలార్ పవర్ పార్క్, ఏరోస్పేస్ పార్క్, పేదలకు ఇళ్లనిర్మాణం, హైదరాబాద్‌లో మౌలిక వసతులు తదితర కార్యక్రమాలను మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ముందుకువచ్చింది. పలు ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి టాటా రియల్టీ గ్రూప్ అంగీకారం తెలిపింది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ పార్క్ అభివృద్ధికి, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థలపై అధ్యయనంపై సేవలు, లైట్‌రైల్ సేవల ద్వారా మెట్రోరైల్ బలోపేతానికి సహకా రం అందించనుంది. ఆదిభట్లలో ఏరోస్పేస్ పార్క్ తదితర కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని టాటా ప్రాజెక్ట్స్ భావిస్తోంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ఆ కంపెనీ సీఈవో ఆసక్తి కనబరి చారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంట ర్గా నిర్మిస్తున్న టి-హబ్‌కు గ్రూప్ చైర్మన్ ఆకర్షితులయ్యారు. ఈ ప్రాజెక్టుకు టీసీఎస్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. టాటా ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా టి-హబ్‌లో వాటాను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్‌లో మురికి వాడల అభివృద్ధి పథకాల అమలుకు టాటా హౌసింగ్ ముందుకు వచ్చిం ది. వివిధ ప్రాజె క్టుల్లో సహకారానికై సమగ్ర విధానాలను అధ్యయనం చేసే నిమిత్తం త్వరలోనే సీనియర్ అధికారుల బృందాన్ని పంపేందుకు టాటా గ్రూప్ చైర్మన్ అంగీకారం తెలిపారు.