తెలంగాణకు ‘టాటా’ పవర్ | tata power in telangana soon | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ‘టాటా’ పవర్

Published Wed, Feb 4 2015 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

మంగళవారం ముంబైలో టాటా గ్రూప్ సీఈవోలతో భేటీ అయిన మంత్రి కేటీఆర్

మంగళవారం ముంబైలో టాటా గ్రూప్ సీఈవోలతో భేటీ అయిన మంత్రి కేటీఆర్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు టాటా పవర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. నిరర్థక భూముల  ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం బయోమాస్ అభివృద్ధికీ ఆసక్తిని కనబరించింది. పవన విద్యుత్‌ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా పరిశీలి స్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను టాటా గ్రూప్ చైర్మన్ సైర స్ మిస్త్రీకి మంత్రి కె.తారకరామారావు వివరించారు. మంగళవారం ముంబైలోని ముంబై హౌస్‌లో టాటా గ్రూప్ సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానా న్ని మంత్రి వివరించారు. వాటర్‌గ్రిడ్, టి- హబ్, ఆర్‌ఐసీహెచ్, పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీలు, సోలార్ పవర్ పార్క్, ఏరోస్పేస్ పార్క్, పేదలకు ఇళ్లనిర్మాణం, హైదరాబాద్‌లో మౌలిక వసతులు తదితర కార్యక్రమాలను మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ముందుకువచ్చింది. పలు ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్  టౌన్‌షిప్‌ల  అభివృద్ధికి టాటా రియల్టీ గ్రూప్ అంగీకారం తెలిపింది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ పార్క్ అభివృద్ధికి, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థలపై అధ్యయనంపై సేవలు, లైట్‌రైల్ సేవల ద్వారా మెట్రోరైల్ బలోపేతానికి సహకా రం అందించనుంది. ఆదిభట్లలో ఏరోస్పేస్ పార్క్ తదితర కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని టాటా ప్రాజెక్ట్స్ భావిస్తోంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ఆ కంపెనీ సీఈవో ఆసక్తి కనబరి చారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంట ర్‌గా నిర్మిస్తున్న టి-హబ్‌కు గ్రూప్ చైర్మన్ ఆకర్షితులయ్యారు. ఈ ప్రాజెక్టుకు టీసీఎస్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. టాటా ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా టి-హబ్‌లో వాటాను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్‌లో  మురికి వాడల అభివృద్ధి పథకాల అమలుకు టాటా హౌసింగ్ ముందుకు వచ్చిం ది.  వివిధ ప్రాజె క్టుల్లో సహకారానికై సమగ్ర విధానాలను అధ్యయనం చేసే నిమిత్తం త్వరలోనే సీనియర్ అధికారుల బృందాన్ని పంపేందుకు టాటా గ్రూప్ చైర్మన్ అంగీకారం తెలిపారు.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement