సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు అనూహ్య బాసట దొరకనుంది. టాటా గ్రూప్‌లోని వాటా సన్స్ జెట్ ఎయిర్ వేస్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ కౌంటర్ గురువారం నాటి తారాజువ్వలా ఎగిసి పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 26 శాతం లాభాలతో ముగిసింది. తొలి నుంచీ జోరందుకున్న జెట్ ఎయిర్‌వేస్ కౌంటర్ మిడ్‌సెషన్ నుంచీ మరింత జోరందుకుంది.
విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి దశలో ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబీకుల వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల ప్రకటించిన జెట్ ఎయిర్‌వేస్ వరుసగా మూడవ క్వార్టర్‌లో కూడా నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాల్లో రూ.1,297 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అధిక ఇంధన ధరలు, డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడంతో భారీ నష్టాలను నమోదయినట్లు సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment