సృష్టిలో అరుదైనవీ, అపురూపమైనవీ కొన్ని ఉంటాయి. సృష్టికే అందాన్నిస్తాయవి. నీలగిరులపై కనిపించే నీలకురింజి పూలు అలాంటి అపురూపాలే!అత్యంత అరుదైన నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. కేరళ, తమిళనాడుల్లో నీలగిరుల పరిసరాల్లో నివసించే గిరిజనులకు ఈ పూలు కొండగుర్తులు.వీటి పూత ఆధారంగానే వారు తమ వయసును చెప్పుకొంటారు. బ్రిటిష్ హయాంలో తొలిసారిగా వీటిని 1838లో తెల్లదొరలు గుర్తించారు.పుష్కరకాలం పాటు మళ్లీ ఇవి కనిపించనే లేదు.
తిరిగి 1850లో కనిపించాయి.అలా పన్నెండేళ్లకు ఒకసారి ఇవి పూస్తాయనే సంగతిని గుర్తించారు.ఈ ఏడాది కూడా నీలకురింజి పూలు నీలగిరులపై విరిశాయి. శరదృతువు ప్రారంభంలో కనిపించే పూలు కొద్ది రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి.
ఒకసారి రాలిపోయాక మళ్లీ పన్నెండేళ్లకుగాని కనిపించవు.
ఈ అరుదైన పూలను కెమెరాలో బంధించడానికి ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ విశాల్‌విజయవాడ నుంచి కేరళలోని నీలగిరుల వరకుబైక్‌యాత్ర చేశారు. ఆయన కెమెరాకు చిక్కిన కొన్ని దృశ్యాలివి.
Comments
Please login to add a commentAdd a comment