కప్పులో టీ కామన్.. టీ కప్పులో తుఫాను.. ఒక ఎక్స్‌ప్రెషన్! టీ కప్పు దీపాలు.. ఇక్కడ విశేషం!! ఇప్పుడు ఇంటి అలంకరణలో ఈ టీ కప్పు దీపాలూ కాంతులీనుతున్నాయి! ఎలాగంటే..
మైనం రంగులు: టీ, కాఫీల్లో ఎన్ని రకాల రుచులు ఉంటాయో.. అన్ని రకాల రంగులు ఉంటాయి. ఆ థీమ్‌తోనే మైనాన్ని తీసుకొని, కొన్ని రంగులను జత కలిపి.. కప్పులో పోస్తున్నారు. వాటిలో వత్తి వేసి, అందంగా ముస్తాబు చేస్తున్నారు.
సువాసనల దీపం: మైనం రంగుల ఎంపికలే కాదు.. వీటికి రకరకాల సువాసనలను జోడిస్తున్నారు. దీంతో ముచ్చటైన వెలుగులు.. ఆ వేడికి కరిగిపోతూ వెదజల్లే రోజ్, జాస్మిన్.. ఫ్లోరల్ పరిమాళాలనూ ఆఘ్రాణించవచ్చు.
రీ యూజ్: కప్పులు పాత బడిపోయినా, పగుళ్లు బారినా వాటిని పడేస్తుంటాం. అభిరుచికి పదునుపెడితే పాత టీ కప్పులను మైనపు దీపాలుగా మార్చుకోవచ్చు. డిజైన్ బట్టి ధర: పింగాణీ కప్పుల ధర, ఎంపిక చేసుకున్న పరిమళాలు.. వెలుగులను బట్టి వీటి ధరలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ కొనుక్కునే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment