ఓయ్‌... నిన్నే | '' Beautiful VILLAGE love story '' oye .. ninne '. | Sakshi
Sakshi News home page

ఓయ్‌... నిన్నే

Jul 3 2017 12:27 AM | Updated on Sep 5 2017 3:02 PM

ఓయ్‌... నిన్నే

ఓయ్‌... నిన్నే

హిట్టు... ఎస్వీకె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన తొలి సినిమా ‘సోలో’ హిట్టు! నిర్మాతగా తొలి అడుగును విజయవంతంగా వేశారు.

హిట్టు... ఎస్వీకె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన తొలి సినిమా ‘సోలో’ హిట్టు! నిర్మాతగా తొలి అడుగును విజయవంతంగా వేశారు. ‘సోలో’ తర్వాత వంశీకృష్ణ నిర్మించిన ‘నువ్వా–నేనా, ‘రారా.. కృష్ణయ్య’ సినిమాలూ హిట్టే! ముచ్చటగా మూడు హిట్స్‌ తర్వాత భరత్, సృష్టిలను హీరో హీరోయిన్లుగా, సత్య చల్లకోటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన సినిమా ‘ఓయ్‌.. నిన్నే’.

ఈ నెల రెండో వారంలో పాటల్ని, నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. కుటుంబ విలువలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయి’’ అన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్‌. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేశ్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్, సంగీతం: శేఖర్‌ చంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement