లింగాలఘణపురం : టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్ష పదవి తనకు రాలేదనే మనస్తాపంతో పటేల్‌గూడేనికి చెందిన ఆ పార్టీ నాయకుడు కాసర్ల సుధీర్ శనివారం ఆత్మహత్యకు యత్నిం చాడు. సీనియర్ కార్యకర్త అరుున తనకు టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్ష పదవి తనకు రాకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారంటూ పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్దకు వచ్చాడు. గ్రహించిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ , ఆయన బావ అక్కడికి చేరుకుని అతడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పురుగుల మం దు డబ్బా పట్టుకుని విగ్రహం వద్ద విలపిస్తుండ గా మహిళా విభాగం మాజీ మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి వచ్చి ఆయనను శాంత పరిచే ప్రయత్నం చేసింది.
ఇంతలోనే ఆయన బావ, బావమరిది వచ్చి బలవంతంగా పురుగుల మందు డబ్బాను సుధీర్ నుంచి లాక్కుని దూరంగా పారేశారు. అనంతరం ఆయనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. కాగా, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుల నియామకం అనంతరం నేలపోగుల, చీటూరు, నాగారం గ్రామా ల్లో అధ్యక్ష పదవిని ఆశించిన నాయకులు నిరస న వ్యక్తం చేశారు. చీటూరులో ఎంపీటీసీ మధు ఆధ్వర్యంలో ఆరుగురు వార్డు సభ్యులు కలిసి ఐల లక్ష్మయ్యను, నాగారంలో సానికె కృష్ణను అధ్యక్షుడిగా నియమించాలని సంతకాలతో కూడిన ప్రతులను అధిష్టానానికి పంపారు.
టీఆర్‌ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
Published Sun, Apr 5 2015 1:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement