
ప్రత్యూషకు రెండో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రత్యూష 82 ఎత్తుల్లో నిషా మొహతాపై గెలిచింది. ఎనిమిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 2.5 పారుుంట్లతో చివరిదైన 12వ స్థానంలో కొనసాగుతోంది.
పద్మిని రౌత్ 6.5 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉండగా... 5.5 పారుుంట్లతో సౌమ్య స్వామినాథన్, ఇషా కరవాడే సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉన్నారుు.