
ప్రత్యూషను కలవనున్న సీఎం కేసీఆర్
సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు.
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీఎం ఒక ప్రకటనలో చెప్పారు.
ప్రత్యూష బాధ్యతలను ప్రభుత్వమే స్వకరిస్తుందని సీఎం చెప్పారు. అయితే ఆమెతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రత్యూష కేసును సీరియస్ గా తీసుకుంది. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని పలువురు ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఈ కేసులో సవతితల్లి ఇప్పటికే జైలులో ఉండగా, తండ్రి రమేష్ ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.