దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్ | Pratyusha suicide: Rahul Raj threatens to jump off hospital building | Sakshi
Sakshi News home page

దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్

Published Sun, Apr 17 2016 8:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్ - Sakshi

దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్

ముంబయి: ఇటీవల మృతిచెందిన నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు.

ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement