jump off
-
కొండపైనుంచి దూకిన ప్రేమ జంట.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని..
ముంబై: ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. కలిసి జీవిద్దామనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అయితే వారు మాత్రం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమ జంట.. కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో కలిసి జీవించలేకపోతున్నామని చావులో ఒక్కటైంది. మహారాష్ట్ర ముంబైలోని కందివాలి ఈస్ట్ జనుపాద ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఆకాశ్ ఝాటె కాగా.. అతడు ప్రేమించిన అమ్మాయి 16 ఏళ్ల విద్యార్థిని. ఆకాశ్ హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రోజు నేను వెళ్లిపోతున్నా.. ఎప్పటికీ తిరిగిరాను అని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అదే రోజు అతని ప్రేయసి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్నిగంటలకే సమతా నగర్ ప్రాంతంలోని ఓ కొండపై నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. ఈ ప్రేమ జంటే విగతజీవులుగా కన్పించారు. దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: సుమేధా శర్మ హత్య.. విషమంగా ప్రియుడి పరిస్థితి?.. బజరంగ్ దళ్ నిరసనలు -
షాకింగ్.. పోలీస్ స్టేషన్ ముడో అంతస్తు నుంచి దూకిన నిందితుడు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. రూ.14 లక్షల మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ మూడో అంతస్తు నుంచి దూకాడు. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా పైనుంచి జంప్ చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడ్ని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ అతడు సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి పేరు ఆనంద్ వర్మ అని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.14 లక్షలు తీసుకుని ఒకర్ని మోసం చేశాడని పేర్కొన్నారు. అయితే ఆనంద్‌వర్మపై కేసు పెట్టింది మరెవరో కాదు, ఇదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అజీత్ సింగ్ కావడం గమనార్హం. ఈ కేసు ప్రాథమిక విచారణలో భాగంగా ఆనంద్‌వర్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే రూ.14లక్షలను అతడు తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో వెంటనే వదిలిపెట్టామని అజీత్ సింగ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఆనంద్ వర్మ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. కాగా.. ఈ కేసు గురించి పై అధికారులకు తెలిసిందని, హెడ్ కానిస్టేబుల్ అజీత్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. -
భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: జిల్లాకు చెందిన ముమ్మిడివరం సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకొంది. కుక్క తరమడంతో భయంతో రెండవ అంతస్తు పైనుంచి ఓ విద్యార్థిని ఎలిపే మధుశ్రీ కిందకు దూకింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. -
కదులుతున్న బస్సులోంచి దూకిన యువతి
న్యూఢిల్లీ: ఆకతాయిల వేధింపులు తాళలేక దక్షిణ ఢిల్లీలో ఓ యువతి కదులుతున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం బాధితురాలు సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రోజు రూట్ నంబర్ 544 ప్రయాణించే తన సోదరిని అకతాయిలు గడిచిన మూడు నెలల కాలంలో ఏడుసార్లు వేధించినట్టు కూడా ఆమె ఆరోపించారు. శనివారం ఈ వేధింపులు మరి ఎక్కువ కావడంతో తన సోదరి అలా చేసిందన్నారు. ‘నా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. తను ప్రయాణించే రూట్లో అల్లరిమూకలు అదేపనిగా యువతులపై వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో తనను కొందరు వ్యక్తులు వేధిస్తే ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో బస్సులోని అందరు కలిసి అతన్ని కిందకి దించేశారు. కానీ ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి మళ్లీ అదే బస్సులో కనబడటం తనలో భయాన్ని పెంచింది. దీంతో తను కొన్ని రోజులు వేరే మార్గాల్లో కళాశాలకు వెళ్లింది. కానీ ఆ రూట్లలో ప్రయాణించడం వల్ల తను కాలేజీకి అలస్యంగా చేరుకునేది.. దీంతో తిరిగి ఇదే మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఢిల్లీలోని చాలా మంది విద్యార్థులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తారు. దీనిని అదనుగా చేసుకునే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. శనివారం ఆకతాయిలు తనను లక్ష్యంగా చేసుకుని నీ గురించి మాకు మొత్తం తెలుసు.. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా మాకు తెలుసు అంటూ వేధించసాగారు. దీంతో భయాందోళనకు గురై కదులుతున్న బస్సులో నుంచి తను కిందకు దూకేసింద’ని బాధితురాలి సోదరి ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. డీసీపీ విజయ్ కుమార్ దీనిపై స్పందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేస్తే తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్న మార్గాలో మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేసి.. యువతులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. -
దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్
ముంబయి: ఇటీవల మృతిచెందిన నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు. -
రేప్ నుంచి తప్పించుకునేందుకు..