కుషాయిగూడలో వ్యక్తిపై కత్తులతో దాడి | Unauthorized people knife-attacked in Kushaiguda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో వ్యక్తిపై కత్తులతో దాడి

Published Sun, Jul 23 2017 3:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

కుషాయిగూడలో వ్యక్తిపై కత్తులతో దాడి

కుషాయిగూడలో వ్యక్తిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌: నగరంలో పట్టపగలే ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్‌లో ఓ వైన్స్ షాప్ ముందు  నవీన్‌(40) అనే వ్యక్తిపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు.
 
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాధితున్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement